Delhi Bans BS3 Petrol, BS4 Diesel Cars Till Friday Over Air Pollution: వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో శుక్రవారం వరకు బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించారు. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్వాన్నమైన గాలి నాణ్యత దృష్ట్యా మంగళవారం నుంచి దేశ రాజధానిలో బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను ఉపయోగించడంపై తాత్కాలిక నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శీతల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం తీవ్ర స్థాయికి దిగజారింది. కాలుష్య నిరోధక నియంత్రణలను మరింత శక్తివంతంగా అమలు చేయాలని అన్ని ఎన్సీఆర్ రాష్ట్రాలను ఆదేశించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ను ప్రేరేపించింది.
Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం
తీవ్రంగా గాలి నాణ్యత క్షీణించినందున బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలపై నిషేధం మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని ఓ రవాణా శాఖ సీనియర్ అధికారి తెలిపారు. పర్యావరణ శాఖతో కలిసి తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. శుక్రవారం వరకు నిషేధం అమలులో ఉందన్నారు. గాలి నాణ్యత మెరుగుపడితే శుక్రవారం లోపు నిషేధాన్ని ఎత్తివేయొచ్చన్నారు. దేశ రాజధానిలో 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక సోమవారం సాయంత్రం 4 గంటలకు 434 వద్ద ఉంది. ఆదివారం 371 నుంచి మరింత దిగజారింది.
