దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధ్యాహ్నం రెండు ఆస్పత్రులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రాగా.. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు కూడా బెదిరింపు వచ్చింది. దీంతో ఫైర్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల వేళ బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్‌గా తీసుకుని సెర్చ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు!
మధ్యాహ్న సమయంలో బురారీ ఆస్పత్రికి, సంజయ్ గాంధీ ఆస్పత్రికి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్స్ అణువణువూ తనిఖీలు చేపట్టింది. కొద్ది రోజుల క్రితమే స్కూల్స్‌కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆస్పత్రులకు బెదిరింపు కాల్స్ రావడంతో తనిఖీలు చేపట్టారు. రెండు ఆస్పత్రుల దగ్గర సోదాలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ.. డివైజ్‌లు గానీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ఢిల్లీలోని బురారి ఆస్పత్రికి తొలుత బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అనంతరం సాయంత్రం 4:26 గంటలకు సంజయ్ గాంధీ ఆస్పత్రికి రెండో బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మూడో బెదిరింపు.. సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.
ఇది కూడా చదవండి: Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు
ఇదిలా ఉంటే గత వారం ఢిల్లీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టి అవి బూటకమని తేల్చారు. మే 2న ఢిల్లీలోని 131, గురుగ్రామ్‌లోని ఐదు, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని మూడు పాఠశాలలకు ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు పంపారు.
ఇది కూడా చదవండి: Indonesia: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 11 మంది టీచర్లు, విద్యార్థుల మృతి
