సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు. 2020 మేలో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇరుదేశాల సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి భారతదేశం, చైనా మధ్య సంబంధాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు జరిగాయి.
Read Also: Iraqi Airways: చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్‌వేస్ విమానం కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్..
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ప్రారంభించిన కమాండర్-స్థాయి చర్చలు చారిత్రాత్మకంగా శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 21వ రౌండ్ తర్వాత శాంతిని కాపాడేందుకు ఇరుపక్షాల నిబద్ధతను ధృవీకరిస్తూ ప్రకటన చేసినప్పటికీ, వివాదానికి స్పష్టమైన పరిష్కారం లభించలేదు. అయితే అధికారుల మధ్య గ్రౌండ్-లెవల్ రొటీన్ కమ్యూనికేషన్ మార్పిడి జరిగింది. కానీ 2024 ఫిబ్రవరి తర్వాత కమాండర్ స్థాయి చర్చలు జరగలేదు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశాల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఉన్నత స్థాయి సైనిక చర్చలు లేకపోవడం ఆలస్యం వెనుక కారణాలపై ఊహాగానాలకు దారితీసింది.
Read Also: Mumbai Rain: ముంబైలో వర్ష బీభత్సం.. ఓపెన్ డ్రైన్‌లో పడి మహిళ మృతి
ముఖ్యంగా పెట్రోలింగ్ హక్కులు, ఉపసంహరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రాథమిక పురోగతి ఉన్నప్పటికీ.. చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల.. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇదే విధమైన భావాలను వ్యక్తం చేశారు. సాధించిన పురోగతిని గుర్తిస్తూ.. పెట్రోలింగ్ హక్కులు, పూర్తి స్థాయిని తగ్గించడానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడలేదని నొక్కి చెప్పారు.