Degree student commits suicide in Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆన్ లైన్ రుణ వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా కృంగిపోయిన ఆ విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ గత ఏడాది ఆన్ లైన్‌లో రుణం తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడంతో బాలస్వామి రుణం చెల్లించ లేకపోయాడు. దీంతో ఆన్ లైన్ ఫైనాన్స్ సంస్థలు బాలస్వామి స్నేహితులకు ఫోన్లు చేసి వేధించాయి. ఇటీవల ఎర్రగుంట తండాలోని బాలస్వామి ఇంటికి వచ్చి ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు బెదిరించారు. దీంతో మానసికంగా కృంగిపోయిన బాలస్వామి గత జనవరి 26న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
Also Read: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్!
జనవరి 26న ఇల్లు వదిలి వెళ్లిపోయిన బాలస్వామి నాయక్ జాడ కుటుంబసభ్యులకు తెలియరాలేదు. ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో డిగ్రీ విద్యార్థి బాలస్వామి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.