NTV Telugu Site icon

Rajnath Singh: తవాంగ్‌లో సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్న రక్షణ మంత్రి

Raj Nath

Raj Nath

విజయదశమి సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్ర పూజలు చేశారు. అనంతరం సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. 4 సంవత్సరాల క్రితమే విజయదశమి సైనికులతో జరుపుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. దేశ భద్రతకు మీరు బాధ్యత వహించే క్లిష్ట పరిస్థితులకు సైనికుల పట్ల గర్వపడుతున్నానని అన్నారు.

Read Also: Exclusive Interview : మార్కాపురం అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

చాలా మంది సైనికులకు ఒక్కసారైనా సైన్యంలో పనిచేయాలనే కోరిక ఉంటుందని రక్షణ మంత్రి అన్నారు. టెరిటోరియల్ ఆర్మీ ద్వారా ఆర్మీ యూనిఫాం మన శరీరాలపైకి రావాలని రాజకీయాల్లో నాయకులు కూడా కోరుకుంటారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. సైనికులు దేశ సరిహద్దులను భద్రంగా ఉంచకుంటే ప్రపంచంలో ఈరోజు ఉన్న స్థాయి భారతదేశానికి ఉండేది కాదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇంతకు ముందు భారత్ అనేక దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేది.. కానీ నేడు రూ.20 వేల కోట్లకు పైగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. తాము భారతదేశానికి విదేశీ సాంకేతికతను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, భారతదేశ ప్రజలు కూడా పాలు పంచుకోవాలన్నారు.

Read Also: Google Pay : చిరు వ్యాపారులకు గూగుల్ పే అదిరిపోయే గుడ్ న్యూస్.. లోన్ పొందే అవకాశం..

తవాంగ్ చేరుకోవడానికి ముందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ లో సైనికులతో ముచ్చటించారు. అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేస్తారనే భావనను ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాల నుండి వచ్చినప్పటికీ ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం.. కలిసి జీవించడం భారత సైన్యం ఐక్యతకు, సోదరభావానికి నిజమైన ఉదాహరణ అని అన్నారు.