Site icon NTV Telugu

Pathaan Issue: ఆ సీన్లు తొలగిస్తారా.. సినిమాను తొలగించాలా?

Mp Home Minister

Mp Home Minister

Pathaan Issue: షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్‌ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం ‘పఠాన్’ నుంచి కొత్త పాట ‘బేషరమ్ రంగ్’ తాజా వివాదానికి దారితీసింది. విడుదలైనప్పటి నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఓ పాట ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఆ పాటే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ చిత్రం నుంచి రిలీజైన బేష‌రమ్ రంగ్ సాంగ్‌లో దీపికా ధ‌రించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంత‌రంతో పాటు అశ్లీలం మోతాదు మించింద‌ని ప‌ఠాన్ మూవీని బ్యాన్ చేయాల‌నే డిమాండ్‌ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పాటపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు.

Prabhas: బాలకృష్ణ – ప్రభాస్ జోడీ క్రేజ్ కు అదే కారణమా!?

ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని తాజాగా మ‌ధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి న‌రోత్తం మిశ్రా కోరారు. ఈ మూవీలో కాషాయ దుస్తుల‌ను వాడటం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్యక్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సీన్లు ఉన్నాయ‌ని, ఈ సీన్లను మార్చనిప‌క్షంలో మ‌ధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామ‌ని హెచ్చరించారు.సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న కాస్ట్యూ్‌మ్స్‌ను, సీన్లను మార్చకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరికలు చేశారు. కుమార్ సాహిత్యంతో విశాల్-శేఖర్ కంపోజ్ చేసిన ఈ పాట షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే మధ్య సిజ్లింగ్ కెమిస్ట్రీని ప్రదర్శిస్తుంది. దీనిపై సినీ బృందం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఇక వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న పఠాన్ మూవీ ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్లలో విడుద‌ల కానుంది.

 

Exit mobile version