2023 Diwali Puja ka Sahi Samay: హిందూ క్యాలెండర్ ప్రకారం… ‘దీపావళి’ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. హిందూ గ్రంధాలలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. దీపావళి రోజున సరైన సమయంలో పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీపావళి రాత్రి మహాలక్ష్మి భూమిపై సంచరిస్తుందని, మనస్ఫూర్తిగా పూజించే వారి ఇళ్లలో శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు.
గ్రంధాల ప్రకారం.. దీపావళి నాడు లక్ష్మీదేవి నుంచి సంపద మరియు శ్రేయస్సు పొందాలనుకునేవారు శుభ సమయంలో పూజ చేయాలి. దీపావళి పూజను శుభ సమయంలో చేసి.. లక్ష్మ దేవిని పూజిస్తే ఖచ్చితంగా ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 12 నవంబర్ దీపావళి 2023 సాయంత్రం ఏ సమయంలో ఐశ్వర్య దేవతను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి పండుగ కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈసారి దీపావళిని దేశవ్యాప్తంగా నవంబర్ 12న జరుపుకుంటున్నారు. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 2:57 గంటల వరకు కొనసాగుతుంది.
ఈసారి దీపావళి నాడు లక్ష్మీ పూజను రెండు శుభ సమయాల్లో చేయవచ్చు. మొదటి శుభ ముహూర్తం నవంబర్ 12 (ప్రదోష కాలం) సాయంత్రం 5.28 నుంచి ప్రారంభమై రాత్రి 8.07 వరకు ఉంటుంది. ఈ కాలంలో పూజలు చేయడం ఉత్తమం. రెండవ శుభ సమయం (నిషిత్ కాల్) రాత్రి 11:39 నుండి 12:32 వరకు ఉంది. లక్ష్మీ పూజ కోసం ఇవి శుభ సమయాలు.
Also Read: Diwali Remedies 2023: దీపావళి రోజున రూపాయి నాణెంతో ఈ పరిహారం చేస్తే.. ప్రతి పనిలో విజయమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీ పూజ చేస్తే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోడు. లక్ష్మీ దేవిని తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి పూజించాలి. గులాబీ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే మంచిది. దీపావళి ఆరాధన సమయంలో లక్ష్మీదేవికి కమల పువ్వును సమర్పించడం ఉత్తమమైనది. ఇలా చేయడం వలన విశేష ఫలితాలు మీ సొంతం అవుతాయి.