Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- ప్రాక్టీస్ సమయంలో దీపక్ చాహర్‌కు చెందిన మూడు క్రికెట్ బ్యాట్లు చోరీ
- చోరీకి గురైన మూడు బ్యాట్ల విలువ సుమారు రూ.1.5 లక్షలు
- సోషల్ మీడియాలో వీడియో ద్వారా ఘటనపై దీపక్ చాహర్ స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepak Chahar Bats Theft: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్ సమయంలో గ్రౌండ్ నుంచి తనకు చెందిన మూడు ఖరీదైన క్రికెట్ బ్యాట్లు చోరీకి గురయ్యాయని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాలో దీపక్ చాహర్ షేర్ చేసిన వీడియోలో ఈ ఘటనపై తన అసంతృప్తిని చాలా చమత్కారంగా వ్యక్తం చేసాడు. తన మూడు బ్యాట్లు గ్రౌండ్ లో చోరీకి గురయ్యాయని తెలిపారు. ఆ మూడు బ్యాట్ల విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని చెప్పుకొచ్చారు. చోరీ చేసిన వ్యక్తికి ఆ బ్యాట్ల విలువ ఎంత ఉంటుందో తెలియకపోవచ్చని.. వాటిని అమ్మడానికి ప్రయత్నించవచ్చని లేదా టెన్నిస్ బాల్‌తో ఆడేందుకు ఉపయోగించవచ్చని చమత్కరించాడు.
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
అలాగే బ్యాట్లు చోరీ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. దీపక్ చాహర్ సరదాగా స్పందించారు. తన వద్ద డబ్బులు కావాలంటే నేరుగా అడిగితే ఇచ్చేవాడినని, కానీ ఇలా బ్యాట్లు చోరీ చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు తనకు కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయని కూడా ఆయన అన్నారు. బ్యాట్లు తిరిగి దొరకకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని.. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లేదా ప్రధాని నరేంద్ర మోదీని సంప్రదిస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు. చివరగా దేవుడిని ప్రార్థించి, బ్యాట్లు తీసుకెళ్లిన వ్యక్తికి మంచి బుద్ధి వచ్చేలా కోరుతున్న అంటూ మాట్లాడాడు.
దీపక్ చాహర్ చాలాకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు భారత్ తరఫున 13 వన్డేల్లో 16 వికెట్లు, 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టారు. ఆయన చివరిసారిగా 2022 డిసెంబర్లో వన్డే మ్యాచ్, 2023 డిసెంబర్లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఐపీఎల్లో దీపక్ చాహర్ గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. ఆ జట్టు తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశారు. అంతకుముందు ఆయన చాలా కాలం చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక ఆటగాడిగా కొనసాగారు. అయితే తన కెరీర్లో ప్రదర్శనతో పాటు తరచూ ఎదురైన గాయాల కారణంగానూ దీపక్ చాహర్ ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
తాజావార్తలు
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!