NTV Telugu Site icon

Family Suside: బోయినపల్లిలో తీవ్ర విషాదం.. ఇంటి పెద్ద లేడన్న బాధతో..!

Crime

Crime

Family Suside: హైదరాబాద్‌ బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలో నివసిస్తోంది. ఇటీవలే ఇంటి పెద్ద, తమ తండ్రి చనిపోయాడు. అయితే తన తండ్రి లేడన్న బాధతో అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ బాధలో కూతుళ్లు చంద్రకళ, దివ్యాంగురాలైన మరో కూతురు సౌజన్య, తల్లి విజయలక్ష్మీ పాలు పంచుకున్నారు.

Read Also: Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ ఆదేశాలు..

వారి బాధకు చావు ఒక్కటే మార్గమని అనుకున్నారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకో లేక.. ఇద్దరు కూతుళ్లు, తల్లి వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. చంద్రకళ ఎంబీఏ చదువుతుండగా.. వికలాంగురాలైన కూతురు సౌజన్య ఇంట్లోనే ఉంటుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలానికి పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు.