తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ కొరవడింది. ఏడాదికి వచ్చేవి ఒకటి రెండు మహా అయితే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేంతే.. కానీ హీరోయిజం ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు నిలబడటం లేదు. లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిశీలిస్తే సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఉమెన్ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన అనుష్క కూడా తాజాగా ఘాటీ ఫెయిల్యూర్‌తో వీరి జాబితాలోకి చేరిపోయింది.
Also Read : Kantara Chapter1 : ఇదేం క్రేజ్ బాబోయ్.. మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..
సమంత యశోద ఓకే అనిపించినా శాకుంతలంతో భారీ డిజాస్టర్ చూసింది. ఇక అప్పటి నుండి ఫీమేల్ ఓరియెంట్ చిత్రం జోలికి పోని సామ్ మా ఇంటి బంగారంతో మరోసారి ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అంటోంది. శుభంతో నిర్మాతగా మారిన సామ్ మా ఇంటి బంగారం నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్ సత్యభామగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించగా చందమామను ఇలా రిసీవ్ చేసుకోలేకపోయారు ఆడియన్స్. తమన్నా ఓదెల2తో ఏదో ట్రై చేసింది కానీ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇక అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం పరదాతో పలకరించినా పాజిటివ్ రెస్పాన్స్ తప్ప పైసా వసూల్ కాలేదు. ఇక తెలుగుమ్మాయి అంజలి గీతాంజలి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చిందీతో వస్తే హిట్ మాత్రం రాలేదు. మహానటితో ఫ్రూవ్ చేసుకున్న కీర్తి సురేశ్ కూడా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, రఘుతాత పేలవమైన ప్రదర్శన కనబర్చాయి. ఇక ఇప్పుడే ఫీమేల్ ఓరియెంట్ చిత్రాల దారి పట్టింది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్, మైసా లాంటి టూ డిఫరెంట్ జోనర్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు చేస్తున్న నేషనల్ క్రష్ మహిళా ప్రాధాన్యత చిత్రాలకు ఊపిరి పోస్తుందో లేదో తెలియాలంటే నవంబర్ 7న రిలీజయ్యే ది గర్ల్ ఫ్రెండ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే.
