Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన 20నిమిషాల్లోనే పశ్చిమ నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన పోఖారాలో ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 72మంది చనిపోయారు. అందులో నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కుప్పకూలిన విమానం కో-పైలట్ అంజు ఖతివాడ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. ఈమె తన మొదటి భర్తలాగే ప్రమాదంలో కన్నుమూసింది. అంజు మొదటి భర్త దీపక్ పోఖరేల్ కూడా యతి ఎయిర్‌లైన్స్‌లో పైలట్. దీపక్ ప్రయాణించిన విమానం జూన్ 21, 2006న కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దీపక్ సహా పది మంది మరణించారు.
Read Also: Plane Accident: నేపాల్ విమాన ప్రమాదం.. ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
దీపక్ మరణం తర్వాత అంజు మళ్లీ పెళ్లి చేసుకుంది. పైలట్‌గానే కొనసాగాలని నిర్ణయించుకుంది. కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించిన అంజు.. నేపాల్‌లోని అత్యంత కష్టతరమైన విమానాశ్రయాల్లో విజయవంతంగా దిగి.. కెప్టెన్‌గా ర్యాంక్‌కు చేరువలో ఉంది. ఆదివారం కనుక ఆ విమానం విజయవంతంగా ల్యాండ్ అయితే ఆమెకు ఫైలట్ గా ప్రమోషన్ వచ్చేది. ఇది ఆమె కల. తాను అనుకున్న కల నెరవేరకుండానే ప్రాణాలు పోగొట్టుకుంది. ప్రమాదం జరిగినప్పుడు అంజు కెప్టెన్ కమల్ తో కో-పైలట్‌గా ఉంది. దీపక్- అంజు దంపతులకు 22 ఏళ్ల కుమార్తె ఉంది. దీపక్ మరణం తర్వాత రెండో పెళ్లిలో ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అంజు తల్లిదండ్రులు ప్రస్తుతం బిరత్ నగర్‌లో నివసిస్తున్నారు.
విమాన ప్రయాణ భద్రత విషయంలో నేపాల్ అధ్వాన్నమైన దేశం. అవన్నీ పాత విమానాలు కావడం విమాన సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడమే ప్రధాన సమస్య. నిన్న కూలిన విమానాన్ని పదిహేనేళ్ల కింద తయారు చేశారు. దీనిని 2012 వరకు భారతదేశంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉపయోగించింది. తర్వాత దీనిని థాయ్‌లాండ్‌లోని ఒక విమానయాన సంస్థ కొనుగోలు చేసి ఉపయోగించింది. 2019లో యతి ఎయిర్‌లైన్స్… వారి నుంచి ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. మెయింటెనెన్స్ నిమిత్తం కొన్ని రోజులు విమానాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అయితే విమానం కూలినప్పుడు ఏదైనా మెకానికల్ లోపం ఏర్పడిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు చెబుతున్నారు.
Read Also:Nepal PM India Tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని!
అంతే కాకుండా.. ఈ సంఘటనలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ ధ్రువీకరించింది. పోఖారకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారలో నిర్వహిస్తున్న ఒక ఈవెంట్‌లో పాల్గొనడం కోసం వెళ్లింది.
#Pokhara Nepal Plane Crash –#नेपाल के #पोखरा में प्लेन क्रैश
कुल 72 लोग सवार थे 16 से ज़्यादा शव बरामद
—#Nepal #planecrash pic.twitter.com/m2woikcifB— Vaibhav Raj Shukla (@VaibhavRjShukla) January 15, 2023
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..