NTV Telugu Site icon

Rajasthan: బాలికపై హత్యాచారం కేసులో నిందితులకు మరణశిక్ష

Mame

Mame

బాలికపై హత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు మరణశిక్ష విధించింది. రాజస్థాన్‌లోని భిల్లారా జిల్లాలో పోక్సో కోర్టు ఈ మరణశిక్ష విధించింది.  మరో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయమూర్తి అనిల్ గుప్తా ఈ తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను నాశనం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలతో సహా మరో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.  పోలీసులు 30 రోజుల్లో 400  పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.

గతేడాది ఆగస్టులో మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి అనంతరం ఆమెను సజీవదహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు సోదరులకు సోమవారం మరణశిక్ష విధించింది. ఫోరెన్సిక్ విచారణ తర్వాత అత్యాచారం, సజీవదహనం జరిగినట్లుగా తేల్చింది.

ఇది కూడా చదవండి: Fire Break : పెట్రోల్ బంక్ లోనే పేలిన లారీ డిజీల్ ట్యాంక్.. అతడే లేకుంటే..

నిందితులు కలు మరియు కన్హాగా గుర్తించారు. షాపురా జిల్లాలోని భిల్లారాలో ఆగస్టు 3న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి బొగ్గు కొలిమిలో దహనం చేశారు. ఈ కేసులో గత శనివారం నిందితుల్ని దోషులుగా తేల్చింది. సోమవారం వారిద్దరికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి: Shade Canopies : వాహనదారులకు వేడి నుంచి రక్షణ కల్పించేందుకు షేడ్ క్యానోపీలు

గతేడాది ఆగస్టు 2న బాలిక పశువులు మేపేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై ఇద్దరు సోదరులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తిరిగి ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు కంగారు పడి వెతకడం ప్రారంభించారు. బాలిక కొలిమిలో కాలడం చూసి షాక్ అయ్యారు. సమీపంలో బట్టలు, చెప్పులు కనిపించాయి. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొలిమిలో వేయకముందు బాలిక సజీవంగానే ఉన్నట్లు ఫోరెన్సిక్ తేల్చింది.

ఇది కూడా చదవండి: Pune: బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. 15 గంటల్లో బెయిల్.. కోర్టు ఏం చెప్పిందంటే..!