Ismail Haniyeh: హమాస్ చీఫ్ కోసం రెండు నెలల ముందు నుంచే “మృత్యువు” వెయిటింగ్..
- హనియే హత్యకు రెండు నెలల నుంచే ప్లాన్..
- గదిలో బాంబు పెట్టి పేల్చినట్లు ఊహాగానాలు..
- తమ గడ్డపై హత్యకావడంపై ఇరాన్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే హత్యకు గురయ్యాడు. పటిష్టమైన భద్రత కలిగిన ఇరాన్‌లో ఈ హత్య ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అయితే, ఈ హత్యలో ఇజ్రాయిల్ పాత్ర ఉందని ఇరాన్‌తో పాటు హమాస్ కూడా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై ఇజ్రాయిల్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. తమ రక్షణలో ఉన్న హనియే హత్య చేయబడటం ఇరాన్‌కి పరువుపోయినట్లైంది.
Read Also: Shivraj Chouhan: మేము “కృష్ణుడిని” గుర్తుంచుకుంటే, రాహుల్ గాంధీ “శకుని” గురించి ఆలోచిస్తున్నాడు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అయితే, హనియే హత్య కోసం రెండు నెలల నుంచే ప్లాన్ నడుస్తుందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. పటిష్ట ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌజులో హనియే ఆశ్రయం పొందారు. అతిథుల కోసం పెద్ద కాంపౌండ్ లోపల గెస్ట్ హౌజ్ ఉంది. హత్యకు రెండు నెలల ముందే హనియే ఉండే గది, దాని పూర్తి సమాచారం లభించిదని, ఆ గదిలో బాంబు పెట్టి ఉంచారని నివేదించింది. హనియే ఉన్నాడనే ఖచ్చితమైన సమచారం తర్వాత బాంబుని రిమోట్ ద్వారా పేల్చేసినట్లు కథనం పేర్కొంది.
క్షిపణి దాడిలో హనియే హత్యకు గురయ్యాడని ముందు అంతా అనుకున్నారు. అయితే, ఇరాన్ మిస్సైల్ రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఇజ్రాయిల్ వీటిని ఎలా తప్పించుకుందనే అననుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ క్షిపణి దాడి చేస్తే నష్టం ఎక్కువగా ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హనియే గది వద్ద క్షిపణి లాంటి చిన్న వస్తువును చూసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇరాన్ అధికారులు మాత్రం పేలుడు గది లోపల జరిగిందని చెబుతున్నారు. ఖచ్చితమైన ప్రణాళికతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్-నఖలా బస చేసిన గది పెద్దగా దెబ్బతినలేదు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, హనియే ఎలా హత్యకు గురయ్యాడనే వివరాలు ఇరాన్ అధికారులకు అంతుబట్టడం లేదు.
- Tags
- Hamas
- Iran
- Ismail Haniyeh
- Israel
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!