NTV Telugu Site icon

Lizard in Budweiser Beer: బడ్‌వైజర్ బీర్‌లో చనిపోయిన బల్లి.. (వీడియో)

Lizard In Budweiser Beer

Lizard In Budweiser Beer

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ షాకింగ్ వీడియో బయటపడింది. ఇది బీర్ తాగేవారిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి స్థానిక మద్యం దుకాణం నుంచి బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అందులో చనిపోయిన బల్లి తేలియాడుతూ.. కనిపించింది. ఇది చూసిన ఆ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

READ MORE: Chandrababu: తెలుగుదేశం ఓ రాజకీయ వర్సిటీ.. నేటితరం నేతల మూలాలు టీడీపీలోనే..

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అతడి ఫ్రెండ్ అనంతయ్య ఇద్దరు కలిసి పార్టీ చేసుకుందామని దగ్గరలోని ఓ వైన్ షాపులో రూ.4వేలు విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి బాటిల్ ఓపెన్ చేద్దామని చూడగానే దిమ్మ తిరిగింది. ఓ బడ్‌వైజర్ బీర్ బాటిల్‌లో ఏదో తేలియాడుతూ కనిపించింది. తీరా చూస్తే బీరు బాటిల్ లో ఉన్నది బల్లి అని తెలిసింది. వెంటనే అతను బాటిల్ ను ఓపెన్ చేయకుండానే వైన్ షాప్ కెళ్లి యజమానికి చూపించి నిలదీశాడు. ” మాకు కంపెనీ నుంచి అలాగే వచ్చింది.. మేము తయారు చేయలేదుగా.. మేమేం చేయాలి.” అని సమాధానమిచ్చాడు. దీంతో నిరాశకు లోనైన కస్టమర్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో వైరల్ గా మారింది.

READ MORE:Eatala Rajendar: దుండిగల్లో అసైన్డ్ భూముల ఆందోళన.. అధికారులపై ఎంపీ ఈటల ఫైర్

కస్టమర్లు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా ఆగ్రహం కనిపించింది. గతేడాది హైదరాబాద్‌లోని ఓ స్థానిక రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. కొన్ని రోజుల క్రితం కూడా బీరు డబ్బాలో చనిపోయిన బొద్దింక కనిపించింది.

Show comments