ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలల్లో ఎక్కువగా హార్రర్ సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్‌గా సైరన్ లాంటి సినిమా మంచి టాక్ ను అందుకున్నాయి. అలాగే రొమాంటిక్ సినిమాలు కూడా ఎక్కువగా హిట్ అవుతున్నాయి… తాజాగా మరో హార్రర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది..
హాలీవుడ్ వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. సరికొత్త డిఫరెంట్ జోనర్‌లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇందులో దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాయి. మరణాంతరం ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్న ఇద్దరు టీనేజర్ దెయ్యాలు వాటి గురించి అవే ఇన్వెస్ట్గేషన్ చేసుకోవడం ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.. ఆ సిరీస్ పేరే డెడ్ బాయ్ డిటెక్టివ్స్.. ఈ సిరీస్ స్టోరీ జనాలకు నచ్చుతుంది..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 25 అంటే ఈ గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ తో పాటుగా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా గంటపాటు రన్ టైమ్‌తో ఉంది. అయితే, ఒక్కో ఎపిసోడ్ ఒక్కో కేస్‌ను సాల్వ్ చేసేదానిలా ఉంది.. ఒక్కో ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయ్యండి..