NTV Telugu Site icon

Dead Body Parcel Case : డెడ్ బాడీ పార్సిల్ కేసులో వీడిన మిస్టరీ..

Dead Body Parcel Case

Dead Body Parcel Case

Dead Body Parcel Case : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలన రేపిన డెడ్‌ బాడీ పార్సిల్‌ కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో పోలీసులకు వరుస ట్విస్ట్ లు ఎదురయ్యాయి. నిందితులు తిరుమాని శ్రీధర్ వర్మ పాటు మూడో భార్య పెనుమత్స సుష్మ అలియాస్ విజయలక్ష్మీ, రెండో భార్య తిరుమాని రేవతి అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ క్రిమినల్ మైండ్ తో వదిన సాగి తులసి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్లాన్ అమలు చేయడానికి కూలి పనులు చేసుకునే పర్లయ్యను 17వ తేదీన కారులో తీసుకువెళ్లి సుష్మాతో కలసి హత్య చేశాడు శ్రీధర్ వర్మ. మృత దేహాన్ని తరలించడానికి సొంతంగా చెక్క పెట్టే తయారు చేసిన శ్రీధర్ వర్మ.. మృత దేహాన్ని కారులో తరలించే సమయంలో టైరు పంచర్ అయ్యింది. అయితే.. మృతదేహాన్ని ఒకరోజు కారులో మరొక రోజు ఇంట్లో ఉంచాడు నిందితుడు.

Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

19వ తేదీన సుష్మా సాయంతో ఆటోలో సాగి తులసి ఇంటికి పంపించాడు నిందితుడు. క్షత్రియ సేవ సంఘం పేరుతో గతంలో రెండు సార్లు తులసికి ఫోన్ చేసిన సుష్మా.. ఇంటి నిర్మాణ సామాగ్రి పేరుతో మృత దేహం పంపింది. హత్య తర్వాత తనని గుర్తు పట్టకుండా ఉండేందుకు క్లీన్ షేవ్ చేశాడు నిందితుడు. మృతదేహం తరలింపు పై ఎప్పటికప్పుడు రెండో భార్యకు సమాచారం ఇచ్చాడు శ్రీధర్ వర్మ. అయితే.. ఈ కేసులో కీలకంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ నిలిచింది.

WHO Chief: బాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు