NTV Telugu Site icon

Thief Rat : శవం కన్ను మాయం.. ఎలుక పైనే అనుమానం

Rat

Rat

Thief Rat : మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో మరోసారి తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మార్చురీలో ఉంచిన మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అతని కళ్లను ఎలుకలు కొరికి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీనికి కొద్ది రోజుల క్రితం కూడా జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అప్పుడు కూడా ఒక రోగి కంటిని ఎలుక కొరికింది.

సమాచారం మేరకు ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకున్న సిబ్బంది మృతదేహంలోని ఒక కన్ను కనిపించలేదు. దీంతో ఈ విష‌యాన్ని హాస్పిటల్ అడ్మినిస్ట్రేష‌న్‌కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విషయంపై ఆరా తీశారు. మార్చురీ హౌస్‌లో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి విషయం తెలుసుకునేందుకు ఆస్పత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

Read Also:Flying Saucer: టర్కీలో ఫ్లైయింగ్ సాసర్.. గ్రహాంతర వాసులొస్తున్నారని భయాందోళన

ఈ కేసుకు సంబంధించి జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ అభిషేక్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ప్రాథమికంగా చూస్తే ఎలుక కంటిని కరిచినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాతే ఏం జరిగిందనేది తెలియనుంది. అయితే, సాగర్‌లోని జిల్లా ఆసుపత్రి మార్చురీలో గుర్తు తెలియని శవం కన్నుమాయవడంతోతో ఆసుపత్రి యాజమాన్యం మరోసారి చిక్కుల్లో పడింది.

Read Also: Dera Baba: పెరోల్ పై బయటకు వచ్చిన బాబా.. మరి ఈ సారి డేరా ఎక్కడో

కొన్ని రోజుల క్రితం, జనవరి 5న కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధువులకు విషయం తెలిసింది. ఇది చూసిన బంధువులు రచ్చ ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం భావిస్తోంది.

Show comments