Site icon NTV Telugu

California: సరస్సులో చెత్తను తొలగిస్తుండగా సూట్‌కేస్‌లో మృతదేహం.. కాలిఫోర్నియాలో ఘటన

Suitcase

Suitcase

అమెరికాలోని కాలిఫోర్నియాలో సూట్‌కేస్‌లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సరస్సులో చెత్తను తొలగిస్తుండగా పారిశుద్ధ కార్మికులకు కంటపడింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం ఓక్లాండ్‌లోని సరస్సును శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులకు నీటిపై తేలుతూ సూట్‌కేస్ కనిపించింది. అది తెరిచి చూడగా.. అందులో మృతదేహాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.

PM Modi: “రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నారు”.. పాకిస్తాన్‌పై ప్రధాని సెటైర్లు..

సూట్‌కేస్‌లో ఉన్న మృతదేహం వయస్సు దాదాపు 30 ఏళ్లు ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సూట్‌కేస్‌ను చూసిన లేక్ మెరిట్ ఇనిస్టిట్యూట్ డ్రైవర్ కెవిన్ షోమో మాట్లాడుతూ.. ఓక్‌లాండ్‌లోని మెరిట్ సరస్సు ఒడ్డున మంగళవారం ఉదయం 11 గంటలకు సరస్సును శుభ్రపరిచే సమయంలో సూట్‌కేస్‌ను గుర్తించామని తెలిపాడు. సరస్సులోంచి సూట్‌కేస్‌ను తీయడానికి చాలా సమయం పట్టిందని అన్నాడు. ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చిన తర్వాత ఆ సూట్‌కేస్‌లో ఏముందో చూడటానికి తాము చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పాడు. కానీ అందులో మృతదేహం ఉంటుందని తెలియదన్నాడు. అందులో మృతదేహం చూసి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించామని తెలిపాడు.

RGV: “వ్యూహం” సినిమానే కాదు వర్మ ఏ సినిమా తీసినా విడుదల కానివ్వను: నిర్మాత నట్టి కుమార్

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మృతదేహం లభ్యమైందని ఓక్లాండ్ పోలీస్ కెప్టెన్ అలాన్ యు ధృవీకరించారు. అయితే సూట్‌కేస్ లో మృతదేహాన్ని ఉంచి ఎవరు వేశారు, ఎప్పుడు వేశారో కనుక్కునే పనిలో ఉన్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇది హత్య కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఓ న్యూస్‌ ఛానెల్కు తెలిపారు.

Exit mobile version