NTV Telugu Site icon

DCP Vineet : మియాపూర్‌ భూ వివాదం.. 21 మంది అరెస్ట్

Madhapur Dcp Vineet

Madhapur Dcp Vineet

మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్‌.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో పోలీసులపై ఆక్రమదారులకు రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100,101 సర్వే నంబర్ లో 415 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో ప్రజలను ఉసిగోలిపిన 50 మందిని గుర్తించడం జరిగిందన్నారు. 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, 21 మందిలో 7గురు మహిళలు ఉన్నారన్నారు.

 

ప్రభుత్వ భుమి ఆక్రమించెందుకు ప్రయత్నించిన కబ్జా దారులు అదుపులోకి తీసుకున్నామని, 2500 మందికి ప్రభుత్వ భూమిని ఇప్పిస్తామని సామాన్య ప్రజలను రెచ్చగొట్టారు కబ్జాదారులు అని ఆయన వెల్లడించారు. HMDA,రెవెన్యూ,పోలీసులు కబ్జాకు వచ్చిన వారితో చర్చలు జరిగే క్రమంలో దాడికి పాల్పడ్డారని, HMDA సైట్ ఆఫీసర్ కు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. దాడి చేసిన వీరిపై 307,తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, 144 సెక్షన్ ఈ నేల 29వ తేదీ రాత్రి వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తేర వేనుక ఉండి నడిపించిన వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు డీసీపీ వినీత్‌ కుమార్‌.