నేరేడుమెట్‌లో జరిగిన బాలుడు కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నేరేడ్‌మెట్ సీపీ కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి కిడ్నాప్ కేసు నమోదు చేశామని, కాలనీలో ఆడుకోడానికి వెళ్లిన బాలుడు ఇంటికి రాలేదన్నారు. దీంతో బాలుడి తల్లదండ్రులు మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ప్రకాశం, శ్రీశైలం, పాలకుర్తి, వరంగల్‌కు పోలీస్ టీం పంపామని, అయితే.. పోలీస్ కేసు వాపసు తీసుకోమని వాట్సాప్ ద్వారా పేరెంట్స్‌కి ఓ కాల్ వచ్చిందన్నారు. కిడ్నాపర్ల నుండి మరోసారి పేరెంట్స్ కి సాయంత్రం వాట్సాప్ కాల్ వచ్చిందని, పేరెంట్స్ వాట్స్ అప్ కాల్ ద్వారా బాబును చూపించాలని వేడుకున్నారన్నారు. ఈ క్రమంలో.. ఓకే కాలనీలో ఉండే వాళ్లే బాబుని కిడ్నాప్ చేశారని గుర్తించామని, రవి అనే కిడ్నాపర్ అదుపులోకి తీసుకొని విచారణ చేసామన్నారు. డబ్బుల కోసం బాబును కిడ్నాప్ చేసారని, రవి, శివ నెల రోజులుగా కిడ్నాప్ ప్లాన్ చేశారని ఆమె వెల్లడించారు.
Also Read : NSA Ajit Doval: సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే భారతదేశం విడిపోయేది కాదు..
అంతేకాకుండా.. ‘రవి, శివ అనే ఇద్దరు నిందితులు అన్ లైన్ ట్రేడింగ్‌లో నష్టపోవడంతో బాబును కిడ్నాప్ చేశారు. 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసారు ప్లాన్ చేశారు. బాలుడుని క్రికెట్ బాల్ ఇప్పిస్తామని చెప్పి కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ఓ మైనర్ జువైనల్ బాలుడు హస్తం ఉంది. తార్నాక వరకు వచ్చి మైనర్ జువైనల్ బాలుడు ఇంటికి వెళ్లిపోయాడు. రవి అనే మెయిన్ కిడ్నాపర్ డిజిటల్ సిమ్ ద్వారా కిడ్నాప్ ఒడిగట్టాడు. బాలుడుతో రవి అనే కిడ్నాపర్ డిజిటల్ ఫోన్ లో టచ్ లోనే ఉన్నాడు. మొత్తం 8 బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేస్ దర్యాప్తు జరిపాం. 36గంటల్లోపు కిడ్నాప్ కేసు ఛాలెంజ్ గా తీసుకొని ఛేదించాము. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. కార్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసాం. బాలుడ్ని తీసుకొని పారిపోతున్న కిడ్నాపర్ లను పట్టుకున్నాము. జనగాం జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామ రోడ్ పై కిడ్నాపర్ల ముఠా పటుకున్నాం. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేశాం’ అని డీసీపీ వెల్లడించారు.
Also Read : Hyundai Creta Price 2023: కేవలం 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!
అనంతరం బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కిడ్నాపర్ల చెర నుండి మా బాబును కాపాడిన పోలీస్ వారికి ధన్యవాదాలు.. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీస్ లకు చెప్తే బాబుని చంపేస్తాము అని బెదిరించారు.. భారీగా డబ్బు డిమాండ్ చేశారు.. కంప్లైంట్ ఇస్తే బాబును చంపేస్తాము అన్నారు.. మా పక్కింటివాళ్లే ఇలా చేస్తారు అనుకోలేదు.. 1989 నుండి హైద్రాబాద్ లో ఉన్నాను.. నాకు, నా కుటుంబానికి శత్రువులు ఎవ్వరు లేరు.. ఎన్టీవీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎన్టీవీలో కిడ్నాప్ వార్త ప్రసారాల ద్వారా పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయ్యారు. మా బాబు సేఫ్ గా మా చెంత చేరాడు.’ అని అన్నారు.
