Purchase Used Hyundai Creta Just Rs 8 lakh in Cars24: భారత ఆటో మార్కెట్లో ‘హ్యుందాయ్ క్రెటా’ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని చెప్పొచ్చు. అయితే ‘సెకండ్ హ్యాండ్’ కార్ మార్కెట్‌లో కూడా క్రెటాకు మంచి డిమాండ్ ఉంది. కొత్త క్రెటా కంటే.. ఎక్కువ క్రేజ్ పాత క్రెటాకే ఉందని చెప్పాలి. ఎందుకంటే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ ధర రూ. 10.87 లక్షల నుంచి మొదలవుతుంది. అదే టాప్ వేరియంట్ ధర రూ. 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. డబ్బు తక్కువగా ఉండి.. క్రెటా కారు ఇస్టపడే వారు సెకండ్ హ్యాండ్ కారు ఎంచుకుంటున్నారు.
మీరు కూడా పాత హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని ఎంపికలు ఉన్నాయి. ‘కార్స్ 24 వెబ్‌సైట్’లో సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు చాలానే ఉన్నాయి. వాటి ధర దాదాపుగా రూ. 8 లక్షలు. పాత కారు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నందున డబ్బు కూడా ఆదా అవుతుంది. అందుతేకాదు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యమైంది ‘రోడ్ టాక్స్’. పాత కారుకు మీరు రోడ్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కారు మొదటిసారి రిజిస్టర్ చేయబడినప్పుడే చెల్లించబడుతుంది.
2016 Hyundai Creta 1.6 S MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో2016 హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ ధర రూ. 7,45,000లుగా ఉంది. ఈ కారు న్యూఢిల్లీలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఇది మొత్తం 65,531 కిమీ ప్రయాణించింది. పెట్రోల్ ఇంజిన్ గల ఈ కారు.. మొదటి యజమాని వద్ద ఉంది. నంబర్ ప్లేట్ DL-7Cతో ప్రారంభమవుతుంది.
2016 Hyundai Creta SX PLUS 1.6 PETROL MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన 2016 హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ 1.6 పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 7,91,000. ఈ కారు న్యూఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు రీడింగ్ 45,050 కిమీ.పెట్రోల్ ఇంజన్ ఉన్న ఈ కారు.. రెండవ యజమానిని వద్ద ఉంది. నంబర్ ప్లేట్ DL-8Cతో ప్రారంభమవుతుంది.
Also Read: IND Squad for WI Tour 2023: రోహిత్, కోహ్లీ, షమీ ఔట్.. వెస్టిండీస్‌తో ఆడే భారత టెస్ట్ జట్టు ఇదే!
2017 Hyundai Creta E PLUS 1.6 PETROL MANUAL:
2017 హ్యుందాయ్ క్రెటా ఈ ప్లస్ 1.6 పెట్రోల్ మాన్యువల్ కారు ధర రూ. 7,93,000. ఈ కారు న్యూ ఢిల్లీలో మాత్రమే అమ్మకానికి ఉంది. ఇది 52,304 కిమీ ప్రయాణించిన ఈ కారులో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. నంబర్ ప్లేట్ DL-8Cతో ప్రారంభమవుతుంది.
2017 Hyundai Creta E PLUS 1.6 PETROL MANUAL:
2017 హ్యుందాయ్ క్రెటా ఈ ప్లస్ 1.6 పెట్రోల్ మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ.8,00,000లుగా ఉంది. న్యూఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తం 22,591 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉండగా.. మొదటి యజమాని అమ్ముతున్నాడు. ఈ కారు నంబర్ ప్లేట్ HR-51తో ప్రారంభమవుతుంది.
Also Read: Weight Loss Tips: బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తే సరిపోదు.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి!