Site icon NTV Telugu

Rishabh Pant-Shah Rukh: బాగా ఆడావ్.. పంత్‌ను మెచ్చుకున్న షారుక్ ఖాన్! వీడియో వైరల్

Pant Shah Rukh Khan

Pant Shah Rukh Khan

Shah Rukh Khan Hugs Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) సహయజమాని షారుక్ ఖాన్ ఫిదా అయ్యారు. బుధవారం విశాఖలో పంత్‌ నో-లుక్ షాట్‌ ఆడినప్పుడు స్టాండ్స్‌లో లేచినిలబడిన చప్పట్లు కొట్టిన షారుక్.. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ఆప్యాయంగా కౌగిలుంచుకున్నారు. బాగా ఆడావ్ అని ప్రశంసలు కురిపించారు. అలానే ఢిల్లీ కెప్టెన్ ఆరోగ్య పరిస్థితి గురించి షారుక్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో రింకూ సింగ్‌తో రిషబ్ పంత్ కూర్చొని మాట్లాడాడు. ఆ సమయంలో షారుక్ ఖాన్ మైదానంలోకి వచ్చారు. షారుక్‌ను చూసిన పంత్ లేచే ప్రయత్నం చేయగా.. ఫర్వాలేదు కూర్చొమని బాలీవుడ్ బాద్‌షా సైగలు చేశారు. అయినా పంత్ లేచి షారుక్ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు ఆప్యాయంగా కౌగిలుంచుకున్నారు. పంత్‌తో కాసేపు ముచ్చటించిన షారుక్.. ఢిల్లీ, కోల్‌కతా ఆటగాళ్ల అందరితో కాసేపు మాట్లాడారు. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, గౌతమ్ గంబీర్‌లను బాద్‌షా కౌగిలుంచుకున్నారు. ఎలాంటి అహం లేకుండా షారుక్ హుందాగా ప్రవర్తించడంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: Rishabh Pant Fine: రిషబ్ పంత్‌కు ‘డబుల్‌’ జరిమానా.. నిషేధం తప్పదా?

2022 చివరలో రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలయిన పంత్‌కు శస్త్రచికిత్సలు జరిగాయి. కోలుకున్న పంత్ ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి ఒకప్పటిలా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్‌పై 18 రన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 28 పరుగులు చేసిన అతడు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ చేశాడు.ఇక కోల్‌కతాపై 25 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు.

 

Exit mobile version