David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Miller: నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఉత్కంఠ బరిత పోరు జరిగింది. చివరి బంతి వరకు జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవాల్సింది ఢిల్లీ. కానీ.. స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ తీసుకున్న ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. గెలుపు ముంగిట బోల్తా పడటంతో ఢిల్లీ స్టార్ బ్యాటర్ మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 20 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినప్పటికీ, ఆఖరి బంతుల్లో తను తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టడంతో మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన వల్లే మ్యాచ్ ఓడిపోయిందని మిల్లర్ బాధ పడటం కనిపించింది. ఈ సమయంలో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అతడి దగ్గరకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు. అక్షర్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
READ MORE: Dhurandhar 2 : ధురంధర్ 2.. 2వేల కోట్లు మార్క్ అందుకోవడం అసాధ్యం
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
అసలు ఏం జరిగింది?
చివరి ఓవర్‌లో రెండు బంతులకు రెండు పరుగులు కావాల్సి ఉంది. చివర్లో మిల్లర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా, నాన్-స్ట్రైకర్‌పై నమ్మకం లేకనో లేక తానే ఫినిష్ చేయాలన్న అతి విశ్వాసంతోనో ఆ సింగిల్‌ను నిరాకరించాడు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి బంతి స్లోయర్ బౌన్సర్‌గా రావడంతో మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. కనీసం ‘బై’ రన్ తీసి మ్యాచ్‌ను టై చేద్దామని నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విప్రాజ్ నిగమ్‌తో కలిసి పరిగెత్తినప్పటికీ, కీపర్ జోస్ బట్లర్ మెరుపు వేగంతో విసిరిన డైరెక్ట్ హిట్ నిగమ్‌ను రనౌట్ చేసింది. దీంతో ఢిల్లీ 209 పరుగుల వద్దే నిలిచిపోయింది.
READ MORE: YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోస్ బట్లర్ (52) తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70), వాషింగ్టన్ సుందర్ (55) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి కేఎల్ రాహుల్ (92), పాతుమ్ నిస్సంక (41) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి ఢిల్లీ వేగానికి బ్రేకులు వేశాడు. చివరి రెండు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సి ఉండటంతో గుజరాత్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ వేలి గాయంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చిన మిల్లర్, మహమ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించి ఢిల్లీని రేసులోకి తెచ్చాడు. అసాధ్యమనుకున్న మ్యాచ్‌ను సుసాధ్యం చేసేలా కనిపించిన మిల్లర్, ఆఖరి బంతికి చేసిన ఆ ఒక్క తప్పుతో తల పట్టుకోవాల్సి వచ్చింది.
Watch it yourself to believe it 🤯
A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd
— IndianPremierLeague (@IPL) April 8, 2026
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!