ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పట్టపగలు బుల్లెట్లు పేలాయి. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు రోగిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్‌గా గుర్తించారు. రోగి కొన్ని వారాల కిందట ఆస్పత్రిలో చేరారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నాలుగు గంటల సమయంలో 18 ఏళ్ల యువకుడు ఆసుపత్రి లోపలికి వచ్చి రియాజుద్దీన్‌పై కాల్పులు జరిపాడు. అతడు 3-4 రౌండ్ల బుల్లెట్లు కాల్చాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రియాజుద్దీన్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు అక్రమార్కులు కూడా ఉన్నట్లు సమాచారం.
READ MORE: Bandi Sanjay: Bandi Sanjay’s sensational comments on Harish Rao..
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్ర వేళ పోలీస్ స్టేషన్ కు జీటీబీ ఆస్పత్రి నుంచి పీసీఆర్ కాల్ వచ్చింది. ఆసుపత్రిలోని 24వ వార్డులో కాల్పులు జరిగినట్లు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఢిల్లీలోని శ్రీరామ్ నగర్ ఖజూరి నివాసి రియాజుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జూన్ 23న రియాజుద్దీన్ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. రియాజుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా…దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు జూలై 13న రాజధానిలోని లజ్‌పత్ నగర్‌లో ర్యాపిడ్ ఫైరింగ్ జరిగింది. దుండగులు సుమారు 10-12 రౌండ్లు కాల్పులు జరిపారు.