NTV Telugu Site icon

Addanki Dayakar: “అన్నీ మీరే కదా చేసింది”..కేసీఆర్ పై అద్దంకి దయాకర్ ఫైర్

Addanki Dayakar

Addanki Dayakar

కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నారు. అన్నీ చేసింది మీరే కదా అని ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో మీరు చెప్పిందే వేదం కదా అని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. మీ హయాంలో మంత్రులు చేసింది ఏముంది.. అంతా మీరే కదా చేసింది. కేసీఆర్ బెదిరించే ధోరణి సరికాదు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణకు ఆదేశించాం. ఎవరినో నిందితులుగా చేయడానికి కాదు” అని దయాకర్ స్పష్టం చేశారు.

REDA MORE: Seethakka:మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల రుణాలు..మంత్రి సీతక్క వెల్లడి

కాగా.. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్‌ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని తెలిపారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటిస్ జారీ చేసింది.. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిషన్‌కు 12 పేజీల లేఖ కేసీఆర్‌ రాశారు.