తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో బరిలో దించే అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే.. ఇందులో ఏడుగురు సిట్టింగులను మార్చిన సీఎం కేసీఆర్.. వారి స్థానాల్లో వేరేవారికి అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్ సైతం ఎప్పుడూ పోటీ చేసి గజ్వేల్ స్థానం నుంచే కాకుండా.. ఈ సారి కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగనున్నారు. అయితే… కొంతమంది ఆశావాహులకు భంగపడడంతో వారిని సంతృప్తి పరిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : China: అయ్యో చైనా యువతకు పెద్ద కష్టమే వచ్చిందిగా..!
ఎల్లుండి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీ అయిన ప్లేస్‌లో కేసీఆర్ కోసం కామారెడ్డి స్థానాన్ని వదులుకున్న గంప గోవర్ధన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిణామంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉండగా.. పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించడంలో భాగంగానే ఈ మంత్రి పదవిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. మంత్రి వర్గంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డిని తొలగిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చూడాలి మరీ ఎవరిని ఏ సీటు వరిస్తోందోనని.
Also Read : Bank Holidays In September: సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
