NTV Telugu Site icon

IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట.. రాణించిన కోహ్లీ, సర్ఫరాజ్

Indi Vs Nz

Indi Vs Nz

3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కాగా.. నేడు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కోహ్లీ (70), సర్ఫరాజ్ (70*) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. జైస్వాల్ (35) పరుగులు చేశాడు. మూడో రోజు ఆట ముగుస్తుందనగా.. అప్పటి వరకూ నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.

Read Also: Deepavali: దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్.. ఎందుకంటే?

అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 402 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ ముందు 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో.. రెండో ఇన్నింగ్స్ లో భారత్ శుభారంభం చేసింది. రోహిత్, యశస్వి మధ్య తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 35 పరుగులు చేసి యశస్వి ఔటయ్యాడు. 63 బంతుల్లో 52 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. కోహ్లి 102 బంతుల్లో 70 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సర్ఫరాజ్ 78 బంతుల్లో 70 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

Read Also: Israel-Lebanon War: భారత్‌ దాతృత్వం.. లెబనాన్‌కు ఇండియా భారీ సహాయం..

Show comments