NTV Telugu Site icon

David Warner Pushpa 2: నాకు మళ్లీ పని పడింది.. దీన్ని నేర్చుకోవాలంటున్న డేవిడ్ భాయ్..

Puspa 2

Puspa 2

ఇదివరకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రాలలో ఒకటైన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్‌ లు చెప్పడంతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ‘పుష్ప 2’ విడుదల చేసిన మొదటి పాట హుక్‌ స్టెప్ పై అతడు తాజాగా మరో కామెంట్ చేసాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Also read: Hebah Patel : అబ్బా.. హెబ్బా అందాలు అదరహో..

ప్రస్తుతం ‘పుష్ప పుష్ప’ పాట ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఈ పాటకు సంబంధించిన హుక్‌ స్టెప్‌ ను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి వార్నర్.. “ఈ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది. దీన్ని నేర్చుకోవాలి” అంటూ పేర్కొన్నాడు. దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ., “ఇది చాలా సులభం. ఈసారి మనం కలిసినప్పుడు నేను మీకు నేర్పుతాను” అని బదులిచ్చారు. అభిమానులు కూడా దీని గురించి ఫన్నీ కామెంట్లు చేస్తారు. ఇక ఈ దిగ్గజ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ కి అవకాశం వచ్చిన ప్రతిసారీ ‘పుష్ప’ తెలుగు పాటకు డాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇప్పటికే పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ తో కూడా కొన్ని రీల్స్ చేసాడు.

Also read: Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..

మరోవైపు ‘పుష్ప 2’ నుంచి విడుదలైన ‘పుష్ప పుష్ప’ పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వ్యూస్‌ తో రికార్డులను బద్దలు కొడుతోంది. యూట్యూబ్‌ లో మూడు భాషల్లో ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌ లో ఉంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తెలుగులో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో లో ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.

Show comments