NTV Telugu Site icon

Brij Bhushan: బ్రిజ్‌ భూషణ్‌ కుమారుడికి బీజేపీ ఎంపీ టికెట్‌.. దేశ కూతుళ్లను ఓడించారు: రెజ్లర్లు

Brij Bhushan.

Brij Bhushan.

Brij Bhushan: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడికి భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ కేటాయించింది. దీనిపై రెజ్లర్లు మండిపడుతున్నారు. ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ విన్నర్ సాక్షి మాలిక్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా.. ఒక వ్యక్తి ముందు ఈ ప్రభుత్వం లొంగిపోయిందా అని క్వశ్చన్ చేసింది. ఇక, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను బ్రిజ్ భూషన్ ఎదుర్కొంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్ గంజ్ నుంచే కరణ్ భూషణ్ సింగ్ బరిలోకి దిగుతున్నారు.

Read Also: Mudragada vs Daughter: తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్‌ కామెంట్స్..!

కాగా, ఈ దేశ కూతుళ్లు ఓడిపోయారని.. బ్రిజ్‌ భూషణ్‌ గెలిచాడని సాక్షి మాలిక్ మండిపడింది. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా తామంతా భవిష్యత్ ను లెక్కచేయకుండా పోరాటం చేశామన్నారు. ఎన్నో రోజులు రోడ్లపైనే నిద్రించి ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ ను ఈ ప్రభుత్వం ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. న్యాయం తప్ప, ఇంకేం డిమాండ్ చేయట్లేదన్నారు. అరెస్టు చేయకపోగా.. ఆయన కొడుకుకి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది అమ్మాయిల మనోధైర్యాన్ని బీజేపీ పార్టీ దెబ్బ తీసిందన్నారు. కేవలం ఒక కుటుంబానికే టికెట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే.. అతడి ముందు ఈ దేశ ప్రభుత్వం బలహీనపడిందా? అనే అనుమానం కలుగుతుందన్నారు. ఇక, శ్రీరాముడి పేరుతో ఓట్లు మాత్రమే కావాలా? ఆయన చూపిన మార్గంలో నడవరా? అంటూ సాక్షి మాలిక్ ప్రశ్నలు కురిపంచారు.

Read Also: Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్

ఇక, కైసర్‌గంజ్‌ పార్లమెంట్ స్థానానికి బ్రిజ్ భూషణ్ ఎంపీగా వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆయనపై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌ సహా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. బీజేపీలో బ్రిజ్ భూషణ్ పై వ్యతిరేకత రావడంతో పాటు ఆయనకు ఈసారి టికెట్ కేటాయించలేదు. ఇక, ఆయన చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ కుమార్.. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక, మరో కుమారుడు ప్రతీక్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.