Site icon NTV Telugu

Pawan Kalyan: అన్ స్టాపబుల్.. ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడంటే.?

Pawan

Pawan

Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమా, రాజకీయ నాయకులతో రెండవ సీజన్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది. ఇక ఈ రెండో సీజన్ కూడా చివరి దశకు చేరుకొంది. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ మొదటిసారి బాలకృష్ణ షో లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మేకర్స్ ప్రోమోస్ తోనే హైప్ ఎక్కువ పెంచేశారు. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మొదటి నుంచి పవన్ ఎపిసోడ్ తోనే సీజన్ 2 ను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్నట్లుగానే పవన్ ఎపిసోడ్ తోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ను పవన్ ఎపిసోడ్ తోనే ముగిస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 3 న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు కొద్దిసేపు డైరెక్టర్ త్రివిక్రమ్, డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేయనున్నారు. పవన్- బాలయ్య ల మధ్య వాడివేడి చర్చలు. ఘాటు ప్రశ్నలు.. కఠినమైన సమాధానాలు.. చాలా ఉన్నట్లు ప్రోమోస్ లోనే చూపించారు. మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తోందో చూడాలి.

Exit mobile version