NTV Telugu Site icon

Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్

New Project (97)

New Project (97)

Varun Tej Matka First Look Release : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్‌ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం పాతకాలం నాటి వైజాగ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే సుదీర్ఘమైన షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ కంప్లీట్ చేసింది. కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు తీయడంతో పాటు నోరా ఫతేహీపై ఓ రెట్రో సాంగ్ షూట్ కూడా పూర్తిచేశారు.

Read Also:Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. రూ. 5 లక్షల రివార్డు

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నోరా ఫతేహీ రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో చాలా అందంగా కనిపించింది. నోరా అద్భుతమైన డాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిన సంగతే. మట్కాలోని ఈ రెట్రో సాంగ్ ఆమె డాన్సింగ్ టాలెంట్ ను మరోసారి చూపించబోతోంది. జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫ్ చేశారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథతో వస్తోంది ఈ సినిమా. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన మేకోవర్‌లు చూపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also:Nitin Gadkari: పంజాబ్‌లో శాంతిభద్రతలు సరిగ్గా లేవు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గడ్కరీ

ఇక ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఒక సరికొత్త మేకోవర్ ని రెడీ చేశారు. ఈ లుక్ పై ఫస్ట్ లుక్ పోస్టర్ ఎపుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ ని రేపు ఆగస్ట్ 11న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి దీనిపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు. దీనితో రేపు రానున్న పోస్టర్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Show comments