Dasara Villain: ‘దేవర’లో దసరా విలన్..పోస్టర్ తో క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా ‘దేవర ‘.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.. బాలివుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మూవీలోని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఇందులో మరో విలన్ ఉన్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు..
నాని ‘దసరా’ చిత్రంలో విలన్‌గా నటించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ‘దేవర’లో కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తన ఇన్‌స్టా స్టోరీస్‌లో హింట్ ఇచ్చారు షైన్ టామ్… దసరా సినిమాలో విలన్ పాత్ర చేసిన టామ్ కు మంచి పేరు వచ్చింది..ప్రస్తుతం యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘రంగబలి’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో తను నటిస్తున్న విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించారు టామ్..తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను షేర్ చేశాడు..
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ‘ దేవర’పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొత్తానికి భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న కథ కూడా మాస్, యాక్షన్ సన్నివేశాలతో ఉంటుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది..ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సమ్మర్ లో ఏప్రిల్ 5 న విడుదల చెయ్యనున్నట్లు టాక్..

తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!