NTV Telugu Site icon

Ayodhya : నేటి నుంచి సామాన్యులకు బాలరాముడి దర్శనం..

Balaram Darshan

Balaram Darshan

Ayodhya : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి సమయాల వివరాలను వారి వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని ప్రకటించారు. ఉదయం 6.30కి జాగరణ హారతికి ఒక రోజు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. రాత్రి 7.30 గంటల సంధ్యా హారతికి అదే రోజు బుకింగ్​చేసుకున్నా సరిపోతుందని తెలిపింది. శ్రీరాముని దర్శనం కావాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచిత పాస్ ఇస్తారు.

Read Also:IND vs ENG: తెలుగు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం!

ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..
బాలరాముని దర్శనం, హారతి పాస్‌ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీరు మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసి, OTPని నమోదు చేసి ధృవీకరించినట్లయితే, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లాగిన్ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్’ విభాగంలోకి వెళ్లి గుర్తింపు వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత హారతి/దర్శన సమయ స్లాట్‌లను ఎంచుకుని.. పాస్ కోసం బుక్ చేసుకోండి.

Read Also: China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు

ఎలా చేరుకోవాలి
అయోధ్య రామమందిరానికి చేరుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, వారణాసి, కోల్‌కతా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్కడి నుంచి అయోధ్య రామమందిరానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయోధ్య మహర్షి వాల్మీకి విమానాశ్రయం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

Show comments