Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danish Kaneria: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ సీజేపీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసనను అణచివేయడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా చేసిన ఒక సెటైరికల్ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసుల కఠిన భద్రత, ముందస్తు ఏర్పాట్లను చూసి ఆయన ఎద్దేవా చేస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, ఢిల్లీలో పోలీసుల భారీ మోహరింపుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటారని నేను ఆశిస్తున్నాను!” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసుల కఠినమైన భద్రతా చర్యలను క్రికెట్ భాషలో ఆయన చేసిన ఈ సెటైర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీలో ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, అక్రమాల ఆరోపణలపై నిరసన తెలిపేందుకు ఆందోళనకారులు జంతర్ మంతర్ వైపు కదిలేందుకు సిద్ధమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మండి హౌస్ సర్కిల్ నుంచి జంతర్ మంతర్ వెళ్లే అన్ని ప్రధాన మార్గాలు, సందుల్లో భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి దారులు మూసేశారు. ఫిరోజ్‌షా రోడ్, బారాఖంబా రోడ్, కన్నాట్ ప్లేస్ తదితర మార్గాలలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎవరూ ఆ వైపు వెళ్లకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
Also Read
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!