Daniel Vettori: “అబ్రార్ మాకు అవసరం”.. పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలుపై SRH కోచ్ సంచలన స్టేట్‌మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daniel Vettori: ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘ది హండ్రెడ్’ (The Hundred) వేలంలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై వివాదం ముదురుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుబంధ జట్టు అయిన సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు సుమారు రూ. 2.34 కోట్లకు పాక్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ అఫీసియల్ ఎక్స్ ఖాతా సైతం సస్పెండ్ అయ్యింది. ఈ సస్పెండ్‌కు గల కారణాలు ఇప్పటి వరకు తెలియదు. అయితే.. ఈ వివాదంపై తాజాగా సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ స్పందించారు. ఇంగ్లాండ్‌లో ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే అబ్రార్ అహ్మద్ మాకు అవసరమని తెలిపారు. అబ్రార్ అహ్మద్ వేరియేషన్స్ చూసి తాము మంత్రముగ్ధులమయ్యామని, అందుకే అతనికి తాము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
“అబ్రార్ లాంటి బౌలర్ చాలా అరుదు. అతడి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యం చాలా అరుదైనది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లోని దేశీ ఆటగాళ్లు ఈ బౌలర్‌ను ఎదుర్కొని రన్స్ సాధించడం కష్టం. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మా ఫస్ట్ ఛాయిస్ మాత్రం అహ్మద్. పాకిస్థాన్ ఆటగాళ్ల ఎంపికపై జరుగుతున్న చర్చలు, రాజకీయ ఉద్రిక్తతల గురించి నాకు తెలుసు. వాస్తవానికి.. ప్లేయర్స్ ఎంపికపై యాజమాన్యం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవు. వేలం బరిలో ఉన్నా అందరినీ మేము సమానంగానే ట్రీట్ చేశాం. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అబ్రార్‌ను తీసుకున్నాం.” అని డేనియల్ వెట్టోరీ స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.
READ MORE: Hyderabad Gas Shortage: గ్యాస్ కొరత.. హైదరాబాద్‌లో కట్టెలకు అమాంతం పెరిగిన డిమాండ్..
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్‌లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!