NTV Telugu Site icon

Clothes: ఇలాంటి డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు.. మీ ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంది..!

Clothes

Clothes

అందంగా కనిపించేందుకు మనం ఎన్నో రకాల డ్రెస్సులు వేసుకుంటాం.. ఆ బట్టలు మనల్ని వేడి, చలి నుంచి సేవ్ చేస్తాయి. ఆ డ్రెస్సులను వేసుకుంటే మీరు అందంగా కనిపించడంతో పాటుగా సౌకర్యవంతంగా ఉంటారు. కానీ కొన్ని రకాల బట్టలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేసే అవకాశం ఉంది. హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డ్రెస్సులను వేసుకోకూడదో మీకు తెలుసా..? ప్రస్తుత కాలంలో చాలా మంది టైట్ బట్టలు వేసుకుంటున్నారు. జీన్స్ నుంచి బెల్టులు, కంప్రెషన్ ఇన్నర్స్ వరకు అన్ని టైట్ గా ఉండటంతో శరీరానికి అత్తుక్కుపోతున్నాయి. టైట్ డ్రెస్సులు కడుపుపై ఒత్తిడిని కలిగిస్తాయి.. వాటిని వేసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య, గుండెల్లో మంట వచ్చే ఛాన్స్ ఉంది.

Read Also: Washington Sundar: వాషింగ్టన్ సుందర్పై విపరీతమైన ట్రోల్స్.. ఫీల్డర్గా టైటిల్ అందించాడు..!

ప్రెసెంట్ జనరేషన్ పూర్తిగా మారిపోయింది. ఇంకేముంది చాలా మంది ఓవర్ వెయిట్, ఊబకాయం, కడుపు నొప్పి లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లావు ఎక్కువున్న వారు అందంగా కనిపించాలని, పొట్ట కనిపించొద్దని తమకు ఇష్టమైన కంప్రెషన్ ఇన్నర్స్, కంట్రోల్-టాప్ ప్యాంటీహోస్ లాంటి బాడీ షేపర్లను వినియోగిస్తున్నారు. ఫిగర్ బాగుండాలని వీటిని ఉపయోగిస్తే మాత్రం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటూ ఆరోగ్య నిపుణలు తెలియజేస్తున్నారు. కింది ఉదర ప్రాంతం, పై తొడపై టైట్ బట్టలు మెరాల్జియా పరేస్తేటికా అని పిలువబడే సమస్యకు దారి తీస్తుంది. ఇది తొడల చుట్టూ ఉన్న నరాలలో చికాకును, నొప్పిని కలిగిస్తుంది.

Read Also: AIADMK: బీజేపీతో పొత్తు లేదు.. అన్నాడీఎంకే నేత కీలక వ్యాఖ్యలు

ఈ మధ్య ఆడవాళ్లే కాదు మగవారు కూడా టైట్ డ్రెస్సులను వేసుకుంటున్నారు. టైట్ గా ఉంటే టై వల్ల మెడ దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా జరుగదు. 40 మంది ఆరోగ్యకరమైన పురుషులపై టైట్ టై ప్రభావం గురించి తెలుసుకోవడానికి నెక్టీ పరికరాన్ని పరిశోధకులు రిసెర్చ్ చేశారు. ఇది స్ట్రోక్ కు కారణమయ్యే సెరెబ్రోవాస్కులర్ రియాక్టివిటీలో మార్పులను కనుగొన్నారు. కొన్ని రకాల డ్రెస్సులు అలెర్జీని, చికాకును కలిగించే ఛాన్స్ ఉందని.. అందుకే డ్రెస్సులు కొనేటప్పుడు మీకు సౌకర్యవంతంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.. ఉన్ని డ్రెస్సులు అలెర్జీలను కలిగిస్తాయని తెలిపారు.

Read Also: Mansion 24: ఓంకారన్నయ్య మళ్ళీ వచ్చేస్తున్నాడు.. భయపెడుతున్న ‘మాన్షన్ 24’ ఫస్ట్ లుక్!

అయితే, చాలా మంది ఎక్కువగా సింథటిక్ బట్టలనే కొనుగోలు చేస్తుంటారు. కానీ సున్నితమైన చర్మం ఉన్న వారికి, తామర ఉన్నవారికి ఈ దుస్తుల వల్ల చికాకు వస్తుంది. నిజానికి సింథటిక్ డ్రెస్సులు అలెర్జీ ఉన్నవారికి ఇబ్బందిని కలిగిస్తాయి.. అలాగే సాక్స్, లోదుస్తులు, బ్రాపై రబ్బరు కారణంగా కొంతమందికి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఇన్నర్స్ లో ఉపయోగించే నైలాన్, లైక్రా లాంటి సింథటిక్ ఫైబర్స్ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయన్నారు.

NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..