Mansion 24: ఓంకారన్నయ్య మళ్ళీ వచ్చేస్తున్నాడు.. భయపెడుతున్న ‘మాన్షన్ 24’ ఫస్ట్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ohmkar Directorial Varalaxmi Sarath Kumar’s Mansion 24 First look out: ఓంకార్ అన్నయ్యగా అందరికీ సుపరిచితుడు అయిన ఓంకార్ ‘రాజు గారి గది’ సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత సమంత, నాగార్జునతో కలిసి ‘రాజు గారి గది 2’ సినిమా తెరకెక్కించారు. ఆ అనంతరం తమ్ముడు అశ్విన్ బాబుతో 2019లో ‘రాజు గారి గది 3’ సినిమా చేశాడు. ఇక ఆ తరువాత ఆయన ఎందుకో సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా టీవీలో డాన్స్ ఐకాన్, సిక్స్త్ సెన్స్, కామెడీ స్టార్స్ ధమాకా వంటి రియాలిటీ షోస్ నిర్మిస్తూ తానే హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓంకార్ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఓంకార్ తనకు కలిసొచ్చిన హారర్ బ్యాక్ డ్రాప్ లోనే ఒక సరికొత్త వెబ్ సిరీస్ తెరకెక్కించగా వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
Naga Suseela: హీరో సుశాంత్, తల్లిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
హారర్ థ్రిల్లర్ గా కథాంశంతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు ‘మాన్షన్ 24’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖం అలాగే చీకట్లో ఉన్న ఓ పురాతన మ్యాన్షన్ ని చూపించారు. ఈ ఫస్ట్ లుక్ ను బట్టి ఈ మ్యాన్షన్ లో జరిగే కథగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందని అంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి, అవికా గోర్, అమర్దీప్ చౌదరి, మానస్, విద్యుల్లేఖ రామన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలియచేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా మేకర్స్ రివీల్ చేయనున్నట్లు చెబుతున్నారు.
So excited for this one..My next release#Mansion24 Watch at your own risk ⚠️#Mansion24OnHotstar coming soon..!!#DisneyPlusHotstar.
@avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie @mgabhinaya… pic.twitter.com/uWRdqFwbRo
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) September 18, 2023
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!