Dangerous Stunt: సోషల్ మీడియా రీల్స్ క్రేజ్ యువతలో పెను ప్రమాదమే తెస్తోంది. అది ఎంతలా అంటే చివరకు ప్రాణాలకే ప్రమాదంగా మారేంతగా.. రియల్ లైఫ్ ను రీల్స్ కోసం తాకట్టు పెట్టడం, ఫేమ్ కోసం రిస్క్ పనులు చేయడం చాలామందికి సర్వసాధారణంగా మారింది. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి అసలు ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందామా..
Read Also:Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?” సూసైడ్ నోట్‌లో దేవుడిపై యువకుడు
ఒడిశాలో కొంతమంది మైనర్ బాలురు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్ షూట్ చేశారు. ఒక బాలుడు రైల్వే ట్రాక్ పై పడుకుని ఉండి. వేగంతో వస్తున్న రైలు అతని మీద నుంచి వెళ్లిపోయే సన్నివేశాన్ని ఇంకొంతమంది వీడియో తీశారు. రైలు వెళ్లిపోయిన వెంటనే మిగతా యువకులు ఆనందోత్సాహాలతో గట్టిగా అరుస్తూ, దానిని గేమ్ లా ఫీల్ చేస్తూ హర్షధ్వానాలు చేశారు. ఈ ప్రమాదకర చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు ఇప్పటికే వీడియోలో కనిపించిన ముగ్గురు పిల్లలను అరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Also:TX Hospital: కాలుకు సర్జరీ చేస్తే.. గుండెపోటుతో బాలుడి మృతి.. ఆసుపత్రిపై కేసు నమోదు..!
ఈ వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం.. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదని, ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందన్నారు. అలాగే సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సెలింగ్ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని.. బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదని హెచ్చరించారు. ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి అంటూ రాసుకొచ్చారు.
చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం.
సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు.
ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్… pic.twitter.com/9fARKsua25
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 7, 2025