NTV Telugu Site icon

Damodara Raja Narasimha : అందోల్ నియోజకవర్గం లో 30 కోట్లతో రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha :  గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రోడ్ల మరమ్మత్తులు లేక రాష్ట్రంలో రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్లతో వివిధ రోడ్డు పునర్నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో రోడ్లు మరమత్తు పనులు చేపట్టకపోవడం తో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల పునర్నిర్మాణ పనుల్లో ఉందన్నారు. అందులో నియోజకవర్గంలో మంగళవారం రూ .30 కోట్లతో వివిధ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. మంగళవారం పుల్కల్ మండలం కోడూరు ఎక్స్ రోడ్డు నుండి కొండారెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వరకు కోట్లతో, డాకుర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వరకు కోట్లతో, రోళ్ల పహాడ్ గేట్ నుండి గ్రామం వరకు కోట్లతో రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

 ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కులగనున కార్యక్రమం పూర్తికావస్తుందన్నారు. సామాజిక ఇంటింటి సర్వే పూర్తికాగానే ప్రభుత్వం నీకు నివేదిక అందజేయున్నట్లు తెలిపారు. చలికాలంను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గురుకుల పాఠశాల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు మేస్చార్జీలు పెంచిందన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించేలా చర్యలు చేపట్టిందన్నారు. చలికాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, పంచాయతీ రాజ్, ఎస్ ఈ జగదీశ్, ఆర్ డి ఓ పాండు, మండల ప్రత్యేక అధికారి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 CM Revanth Reddy : ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి