NTV Telugu Site icon

Damodara Raja Narasimha: ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ సంస్థలపై బురద జల్లుతున్నారు

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ‘నర్సుల నిర్లక్ష్యం శిశువు మృతి’ పై ఓ దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. వార్త కథనం పై వైద్య విధాన పరిషత్ కమిషనర్ ను విచారణకు ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు తక్షణమే హుజూర్ నగర్ ఆస్పత్రి సూపరిoటేoడెంట్ గారితో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. టీవివిపి కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రిక లో వచ్చిన వార్త కథనం లోని పలు అంశాలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. నిరాధారమైన వార్త ను నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.

Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?

మీ పదేళ్ల పాలనలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ సంస్థలపై బురద జల్లుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంస్థల పట్ల నమ్మకం పోయేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయని, ప్రజాస్వామ్యంలో హుందాగా వ్యవహరించండన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై గౌరవం పెరిగేలా మాట్లాడాలన్నారు మంత్రి దామోదర. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్పందిస్తానని ట్విట్టర్‌లో హెచ్చరించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.

Bandi Sanjay : 2019లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం