Site icon NTV Telugu

Rajasthan: దళిత మహిళపై రోజుల తరబడి సామూహిక అత్యాచారం, నిందితుల్లో పూజారి

Physically Harassed

Physically Harassed

Rajasthan: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 25ఏళ్ల దళిత మహిళపై పూజారితో సహా కొంతమంది వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. మహిళ చాలా రోజులు నిర్బంధంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ పూజారి, ఆమె కుటుంబం కోసం ప్రార్థనలు చేసే పూజారి సంజయ్‌ శర్మ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ శర్మ తొలిసారి అత్యాచారం చేసి ఆ మహిళను వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో ఆధారంగా బాధితురాలి నుంచి డబ్బు వసూలు చేశాడు. డబ్బు వసూలు చేయడమే కాకుండా కొంతమంది వ్యక్తులతో కలిసి ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడని అజ్మీర్ నార్త్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఛవీ శర్మ తెలిపారు. నిందితులు మహిళకు కొన్ని మత్తుమందులు ఇచ్చారని, ఎంత మంది సామూహిక అత్యాచారం చేశారో చెప్పలేమని డీఎస్పీ శర్మ తెలిపారు. బాధితురాలికి ఓ పాప కూడా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా నిందితులు తనను బలవంతంగా నిర్బంధించారని, పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

Manchu Lakshmi: ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు

భర్తను, బిడ్డను చంపేస్తానని పూజారి మహిళను బెదిరించాడు. వీడియోను వైరల్ చేస్తానని కూడా చెప్పాడు. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను సెప్టెంబర్ 27న పోలీస్ స్టేషన్ బయట పడేశారు. అక్టోబర్ 7న బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version