ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 25ఏళ్ల దళిత మహిళపై పూజారితో సహా కొంతమంది వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.
దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో 30 ఏళ్ల మహిళపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.