NTV Telugu Site icon

Daggubati Rana: ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ కు గాను..

Rana Daggubati

Rana Daggubati

Daggubati Rana Best Actor for Rananaidu Web Series: టాలీవుడ్ అగ్ర కథ నాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన సంచలన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఈ సిరీస్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ సిరీస్ లో కాస్త భిన్నంగా చూపించారు. అయితే, ఈ సిరీస్ కి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. ఇకపోతే తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా దగ్గుబాటి రానా అవార్డు పొందాడు. ” ఇండియన్ టెలి అవార్డు 2024 “లో భాగంగా రానా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో రానా హాజరు కాకపోవడంతో ఆయన బదులు రానా నాయుడు సీరియస్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు.

Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!

ఇక ఈ అవార్డు అందుకోవడంతో రానా స్పందించారు. ఈ విషయంపై రానా మాట్లాడుతూ.. తాను ఈ పురస్కారానికి ఎంపిక అవడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు. దీంతో ప్రస్తుతం రానా కు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి. ఇకపోతే రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్పుడూ తాను మంచి కథల పైన దృష్టి పెడతానని ఈ సీరియస్ ఒక కుటుంబంలో జరిగిన గ్యాంగ్ స్టార్ డ్రామా అని తెలుపుతూనే ప్రేక్షకులు బాగానే ఆకట్టుకుంది అంటూ చెప్పకోచ్చారు. వెబ్ సిరీస్ లో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్న ఎంతో ధైర్యంగా దీనిని చిత్ర బృందం తెరకెక్కించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే., ఈ సినిమా నెట్ ఫిక్స్ లో విడుదలయ్యి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. రన్ టైం పరంగా ఈ వెబ్ సిరీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ గా టాప్ లో నిలిచింది.

Sudheer Babu : ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రెండింగ్..ఎక్కడంటే …?

రానా నాయుడు వెబ్ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ ” రే డోనోవస్ ” కు రీ మేకింగ్ గా తెరకెక్కించారు. క్రైమ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ బాబాయ్, కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కంటెంట్ పరంగా ఈ వెబ్ సిరీస్ విమర్శలు ఎదుర్కొన్న గాని అతి త్వరలో ఈ సిరీస్ సీక్వెల్ ఉండబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా కూడా తెలిపింది. కాబట్టి అతి త్వరలో ఫ్యామిలీ డ్రామాతో రానా నాయుడు 2 సిరీస్ విడుదల కాబోతోంది. చూడాలి మరి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Show comments