ఇటీవల బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి నియామకం కాగా.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రథ సారథులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అత్యున్నత విజయాలను కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?
ఇదిలా ఉంటే.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో నిర్వహించారు. అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఓ కార్యకర్త ఇచ్చిన ఖడ్గాన్ని ఆయన చార్మినార్ ముంగిట ఎత్తి చూపెట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Also Read : Heavy Rains: కామారెడ్డిలో భారీ వర్షాలు..బయటకు రావొద్దంటు దండోరా..
