NTV Telugu Site icon

Daggubati Purandeswari: అమిత్‌షాను కలిసిన లోకేష్‌.. ఇప్పుడు సమాధానం చెప్పండి..!

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌.. తనపై కేసుల విషయాన్ని షా దగ్గర ప్రస్తావించారు.. సీఎం వైఎస్‌ జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్ వెల్లడించారు.. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్‌ వెనుక బీజేపీ ఉందంటూ ప్రచారం చేస్తున్నవారిని నిలదీశారు.

Read Also: F2 : బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను నారా లోకేష్‌ కలిసి విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందని ఆరోపణలు చేస్తున్నవారు ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్‌షా.. లోకేష్‌కి ఎలా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం, ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు చేస్తున్న కక్షసాధింపు రాజకీయాల గురించి లోకేష్‌ అమిత్‌షాకు వివరించారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు పురంధేశ్వరి. కాగా, అమిత్‌షాతో జరిగిన నారా లోకేష్‌ భేటీలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్న విషయం విదితమే.