Site icon NTV Telugu

Daggubati Purandeswari : భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం

Daggubati Purandeswari

Daggubati Purandeswari

విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఆమె కార్యకర్తలను ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. స్వతంత్రం కోసం బలిదానం చేసిన వారికి నివాళులు, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ సంక్షేమం అభివృద్ధి చేసింది కేంద్రమని, సౌభ్రాతృత్వ భావనతో మనందరం ముందడుగు వేయాలన్నారు. మోడీ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారని, ఇది ముమ్మటికి నిజమన్నారు.

Also Read : PM Modi Speech: మణిపూర్‌కు దేశం అండగా ఉంది.. భారత్‌ ప్రపంచ మిత్రుడుగా ఉద్భవించింది

ఇదిలా ఉంటే.. విజయవాడ సి ఛానెల్ ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అపార్ట్మెంట్ లో అందరూ కలిసి స్వతంత్ర దినోత్సవం చేసుకోవడం అభినందనీయమని, భిన్నత్వం లో ఏకత్వం అంటే ఇదేనేమో అని ఆమె అన్నారు. గడిచిన స్మృతి కాదు స్వాతంత్ర్యం.. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండాలన్నారు.

Also Read : Tuesday Remidies: అదృష్టం కలిసిరావడం లేదా?.. మంగళవారం నాడు ఈ చర్యలు చేస్తే డబ్బే డబ్బు!

Exit mobile version