NTV Telugu Site icon

Dadisetti Raja: భర్తకు మద్దతుగా భార్య.. తండ్రికి తోడుగా తనయుడు ఎన్నికల ప్రచారం

Dadisetti Raja

Dadisetti Raja

Dadisetti Raja: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేపడుతున్నారు.

Read Also: Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాకు మద్దతుగా భార్య లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్‌లు ప్రచారం నిర్వహించారు. తుని మండలం ఎస్‌ అన్నవరంలో లక్ష్మీ చైతన్య భర్త రాజాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మహిళలను ప్రత్యేకంగా కలిసి జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. దాడిశెట్టి రాజా కుటుంబాన్ని ఎంత గౌరవిస్తారో, నియోజకవర్గ ప్రజలకి అదే స్థాయిలో అందుబాటులో ఉంటారని ప్రచారం నిర్వహించారు. మరోవైపు కుమారుడు శంకర్ మల్లిక్ కోటనందూరు మండలంలో తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు.. మున్సిపల్ ఎన్నికల్లో తునిలో ఏవిధంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందో అవే ఫలితాలు వచ్చేలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.