Site icon NTV Telugu

Dabbawala service: లండన్‌ లోనూ ‘డబ్బావాలా’.. వీడియో వైరల్..

Dabbawala

Dabbawala

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆయన నెటిజన్లతో తనకు ఇష్టమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. ఇకపోతే ఆయన చేసిన తాజా పోస్ట్ వైరల్ అయ్యింది. ముంబై లోని డబ్బావాలా ఫుడ్ డెలివరీ సిస్టమ్ నుండి ప్రేరణ పొందింది ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్. ఇందుకీ సంబంధించి లండన్‌ లో ప్రారంభించిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ గురించి వీడియోను ఆయన పోస్ట్ చేసారు. ముంబయి లోని డబ్బావాలాలు ఉదయం పూట ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారి కోసం ఇంటి నుంచి ప్యాక్ చేసిన లంచ్‌ లను సేకరించి లంచ్ టైమ్‌ లో ఆఫీసులకు, స్కూళ్లకు అందజేస్తున్నారు.

Also Read: Amit Shah: హెలికాప్టర్‌ లోపం.. అమిత్ షాకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

లండన్‌ లోని కొంతమంది వ్యాపారవేత్తలు డబ్బావాలా ఉదాహరణ ఆధారంగా డెలివరీ స్టార్టప్‌ ను స్థాపించారు. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి వారు స్టీల్ డబ్బాలను ఉపయోగిస్తారు. ఇందులో పనీర్ సబ్జీ, మిక్స్‌డ్ రైస్, కూరగాయలు ఉపయోగించి చేసే వెజ్ ఐటమ్స్ వంటి భారతీయ వంటకాలను తయారు చేసిన ఆర్డర్‌ లను స్వయంగా వాటిని గుడ్డలో చుట్టి., కార్గో బైక్‌ లపై డెలివరీ చేస్తారు. మహీంద్రా ఈ వీడియోను ‘‘రివర్స్‌ కాలనైజేషన్ అవుతుందని చెప్పడానికి ఇంతకంటే మెరుగైన, ‘రుచికరమైన’ సాక్ష్యం లేదు’’ క్యాప్షన్‌ తో షేర్ చేసారు.

Also Read: ATM Blast: ఏటీఎంలో చోరీకి ప్రయత్నం.. షార్ట్‌ సర్క్యూట్‌ దెబ్బకి..

భారత్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కు లండన్‌లో గుర్తింపు లభించడం, స్థానికుల నుంచి మద్దతు లభించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు అనేక కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఒకరు ఇది వలసవాదమా లేక వ్యాపారావకాశమా..? అని అనగా.. మరో నెటిజన్ స్పందిస్తూ.. భూమిని ప్లాస్టిక్ భూతాన్ని రక్షించడమే ఏకైక పరిష్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version