Site icon NTV Telugu

D. Raja: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటి..?

Raja

Raja

D. Raja: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సీపీఐ బస్సు యాత్ర ముగింపు సభలో పాల్గొ్న్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తలనరికి తీసుకురావాలని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఢిల్లీలో చర్చకు సిద్ధమన్నారు. అమిత్ షాతో పాటు ఎవరు చర్చకు వచ్చినా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించారని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బీజేపీ నేతలు చదివి ఉంటే సనాతన ధర్మం గురించి అర్థమై ఉంటుందని డి.రాజా అన్నారు.

Read Also: Rithu Chowdary: విప్పి చూపించడమే పనిగా పెట్టుకున్నావా.. మరీ ఇంతగానా.. ?

సేవ్ ఇండియా-చేంజ్ ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళతామని డి.రాజా పేర్కొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ పేరుకేనా.. దేశంలో ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. మరోవైపు జీ-20 సమావేశాల పేరుతో మోడీ హడావిడి చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోడీ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏంటో స్పష్టంగా మోడీ చెప్పగలడా అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మోడీ తెలుసుకుంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి మళ్ళీ మాట్లాడడని రాజా తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాలు దేశప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని డి.రాజా మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం లేదని ఆరోపించారు. కమ్యూనిస్టులను ప్రజలు నమ్ముతున్నారని.. ప్రజల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అరెస్టులు చేసినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గం..ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం

Exit mobile version