NTV Telugu Site icon

Biparjoy Cyclone: బిపర్ జోయ్ తుఫాన్ మరో 12 గంటల్లో బలహీనం

Biparjoy Cyclone

Biparjoy Cyclone

బిపర్‌జోయ్ తుఫాన్ మరో 2 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది. బిపర్‌జోయ్ తుఫాన్ ఆగ్నేయ పాకిస్థాన్‌ను ఆనుకొని నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ధోలవీరాకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావంతో కచ్‌లోని భుజ్‌లో పలు చెట్లు నేలకూలాయి. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తుంది.

Also Read: BEL Jobs: బీటెక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..

అరేబియా సముద్రంలో ఉద్భవించిన బిపర్‌జోయ్ తుఫాన్ భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని చుట్టుముట్టింది. గురువారం రాత్రి కచ్‌లోని జఖౌ నౌకాశ్రయానికి ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటింది. అయితే బిపర్‌జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన తర్వాత రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో తుఫాన్ పీడిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వేశాఖ అధికారులు మరికొన్ని రైళ్లను క్యాన్సిల్ చేశారు.

Also Read: Sai Dharam Tej: మామ భోళా శంకర్.. అల్లుడు గంజా శంకర్.. బావుందయ్యా

ఇవాళ (శనివారం) తెల్లవారుజామున గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌లో తుఫాన్ అనంతరం రాష్ట్రంలోని పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహించాలని బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లను గుజరాత్ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Off The Record : టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి వైసీపీ చెక్ పెట్టనుందా..?

తుపాను కారణంగా బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ కారణంగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీలోనూ వర్షం కురిసింది. తుఫాన్ అనంతరం రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.